వైసీపీ, టీడీపీలో ఎవరికి నష్టం?

YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Congress, CPI, CPM, Bjp, Sharmila, Ys Jagan,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Congress, CPI, CPM, Bjp, Sharmila, Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ కూటమి ఖరారైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ కలిసి నడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూడు పార్టీల కూటమి ఎన్డీఏగా పోటీకి దిగనుంది. మరోవైపు తాజాగా  షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఇండియా కూటమితో  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా కలవబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఈ కూటమి ఏర్పాటు వల్ల వైసీపీకి నష్టం కాకుండా లాభమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ కలిసి నడుస్తున్న చంద్రబాబు, పవన్ లక్ష్యానికి నష్టం చేయనుందని చెబుతున్నారు.

నిజానికి కొద్ది రోజులుగా ఏపీ ఎన్నికల సమయంలో ఆసక్తికర రాజకీయం జరుగుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన  పార్టీలతో బీజేపీ కలవటం ఖరారైందని చెబుతున్నా అధికారికంగా  ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే  తాము కూటమిగా ఎన్నికలకు  వస్తున్నామని  చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ టీడీపీతో పొత్తు ఖాయం చేసుకోవాలని భావించిన సీపీఐ,సీపీఎం పార్టీలు.. ఇప్పుడు టీడీపీ, బీజేపీతో పొత్తుకు రెడీ అవడంతో.. కాంగ్రెస్‌తో కలవడానికి నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయిన రెండు పార్టీలు.. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకుని.. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా.. కూటమి కట్టడానికి ఈ మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. సీట్ల పంపకాలపైన  ఫిబ్రవరి 26న అనంతపురం సభ తరువాత సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే  ఈ కూటమిలో సీబీఐ మాజీ జేడీ  లక్ష్మీనారాయణ కూడా కలుస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ, ఇంకా దీనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీలో ఏర్పడిన తాజా రాజకీయ సమీకరణాలతో  ఏపీలో వైసీపీ, ఎన్డీఏ, ఇండియా కూటమిలతో త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది.

ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుతో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తామంతా ప్రయత్నిస్తున్నట్లు ..టీడీపీ,జనసేన, బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా అనే చర్చ మొదలైంది.  వామపక్షాలకు ఉద్యోగ , ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సపోర్ట్ ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో.. టీడీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లు గెలిచింది. ఇప్పుడు వామపక్షాలతో కాంగ్రెస్ కలిస్తే.. ఓట్ బ్యాంక్ కొంత వరకూ పెరుగుతుందనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో, ఆ పార్టీల  ఓట్ బ్యాంక్ తో పాటూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా.. ఈ రెండు కూటమిలు చీల్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE