కీలక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జగన్

Ali to contest as MLA, Jagan, constituency,YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Congress, Ys Jagan,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Ali to contest as MLA, Jagan, constituency,YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Congress, Ys Jagan

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. సర్వేల ఫలితాలతో పాటు కార్యకర్తల సూచనలు, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థుల బలాబలాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్‌లను ప్రకటిస్తూ అభ్యర్ధులను కన్ఫమ్ చేస్తున్నారు. అయితే  కొద్ది రోజులుగా సినీనటుడు అలీ విషయంలో  జగన్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అలీని ఎంపీగా పోటీ చేయిస్తారని, లేదా.. రాజ్యసభకు పంపుతారంటూ ప్రచారం జరిగింది. కానీ అలీని అసెంబ్లీకి తీసుకెళ్లడానికి  జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారిన ఓ జిల్లాలోని కీలక అసెంబ్లీ స్థానాన్ని అలీ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నిజానికి కొంతకాలంగా అలీ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై పెద్ద చర్చ జరిగింది. దీనిలో భాగంగా గుంటూరు ఎంపీగా బరిలో దిగుతారని అలాగే..అలీ తన సొంత ఊరు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని  కథనాలొచ్చాయి. అదే సమయంలో నంద్యాల నుంచి అలీ  పోటీకి దిగే అవకాశాలున్నాయని గతంలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా జగన్.. అలీ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నారని..అలీని నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని జగన్ నిర్నయంతీసుకున్నట్లు తెలుస్తుంది.

నిజానికి ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీకి  ఎదురుదెబ్బలు గట్టిగానే తగిలాయి.  ఉమ్మడి నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సైకిలెక్కేయగా.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో నెల్లూరు జిల్లా విషయాన్ని వైసీపీ అధినేత  చాలా సీరియస్ గా తీసుకున్నారని ఆలోచిస్తున్నారట.  అందుకే అక్కడ నిలబెట్టే అభ్యర్థుల ఎంపికపైన జగన్ చాలా సీరియస్ గా ఆలోచిస్తూ, రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే నెల్లూరు సిటీ స్థానం నుంచి అలీని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబెట్టించడానికి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం నెల్లూరు సిటీకి కో ఆర్డినేటర్‌గా డిప్యూటీ మేయర్ ఖలీ ఉన్నారు. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు. దీంతో… పోటీ బలంగా ఉండటంతో..అలీ  అయితే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఇక నెల్లూరు  సిటీ స్థానం నుంచి ఎక్స్  మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్ 3 సార్లు పోటీ చేసి, రెండు సార్లు గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ..పీఆర్పీ అభ్యర్థిపై 90 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాతత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్.. వరుసగా రెండుసార్లు కూడా విజయం సాధించారు. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్  పోటీకి దిగుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =