వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ

Alla Ramakrishna Reddy, Amaravati assigned lands, Amaravati land scam, Amaravati land scam case, Andhra Pradesh CID issues notice to former chief Minister, AP CID Issues Notices To Mangalagiri YSRCP MLA Alla Ramakrishna Reddy, CID Issues Notices To Alla Ramakrishna Reddy, Crime Investigation Department, Mangalagiri YSRCP MLA, Mangalagiri YSRCP MLA Alla Ramakrishna Reddy, Mango News

మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బుధవారం నాడు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్‌ భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.

ఈ అంశంపై కేసు నమోదు కావడంతో అమరావతి భూములు కొనుగోలు, అమ్మకాల వివరాలు సహా తన దగ్గర ఉన్న ఆధారాలు చూపించాలని సీఐడీ సూచించింది. మరోవైపు రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, మాజీ మంత్రి పి.నారాయణకు 41 సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీన నారాయణను, మార్చి 23వ తేదీన చంద్రబాబును విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ