ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. జూన్ 2, మంగళవారం నాడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఈ పర్యటన వాయిదా పడినట్టు తెలిపారు. కరోనా వలన సుదీర్ఘంగా లాక్‌డౌన్ అమలులో ఉండడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిన నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయా అంశాలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో, అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు, ఇతర ప్రాజెక్టుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యి చర్చించాలని సీఎం వైఎస్ జగన్ భావించారు. కాగా చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu