వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది: సీఎం జగన్

Amul Paala Velluva Project, Amul Paala Velluva Project In West Godavari, Amul Paala Veluva, Amul Paala Veluva project lauch, Andhra Pradesh Government, dairy sector in Andhra Pradesh, development project, Mango News, West Godavari, ys jagan mohan reddy, YS Jagan Mohan Reddy Launches Amul Paala Velluva Project, YS Jagan Mohan Reddy Launches Amul Paala Velluva Project In West Godavari, YS Jagan reviews on Amul project

పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాదయాత్ర చేసిన సమయంలో లీటర్‌ పాల ధర కంటే లీటర్‌ నీళ్ల ధరే ఎక్కువ ఉందని ప్రజలు తమ ఆవేదనను తన వద్ద వ్యక్తం చేశారని అన్నారు. రాష్ట్రంలో రైతు బాగుండాలని అంటే రైతుకు వ్యవసాయమే కాకుండా, వ్యవసాయ ఆధారిత రంగాల్లో కూడా రైతుకు అవకాశం వచ్చినపుడే గ్రామీణ ఎకానమీ నిలబడగలుతుందని నమ్మానని అన్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్ సంస్థను తీసుకురావడం జరిగిందని చెప్పారు.

వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది:

ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, వైఎస్‌ఆర్‌ కడప వంటి 4 జిల్లాల్లోని 766 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కింద పాలసేకరణ విజయవంతంగా జరుగుతుండగా, ఈ రోజునుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ అడుగుపెడుతుందని, మొత్తం 153 గ్రామాల్లో నేటి నుండి పాల సేకరణ ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు. అమూల్ ద్వారా వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని 9,899 గ్రామాలకు ప్రాజెక్టును విస్తరిస్తామని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోందని, అక్కచెల్లెమ్మలకు లీటరు పాలపై రూ.5 నుండి రూ.15 అదనంగా లబ్ది కలిగేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 17 =