దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) 13వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ ను తలుచుకుంటూ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా భావోద్వేగపు ట్వీట్ చేశారు. “నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ పాటుగా ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY




































