దిశ చట్టంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ

Andhra Pradesh, Andhra Pradesh News, AP CM YS Jagan Held Review On Disha Act, AP CM YS Jagan Review On Disha Act, AP Disha Act, disha act, Disha Act In AP, Disha Act Latest News, Disha Act News, Mango News, Set up Disha special courts, YS Jagan Review Meeting Over Disha Act, YS Jagan Review On Disha Act

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు దిశ చ‌ట్టంపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం దిశా చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే మొత్తం 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మహిళలు, బాలబాలికలపై నేరాలకు సంబంధించి వారం రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. తిరుపతి మరియు విశాఖపట్నంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయడంతో పాటుగా అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా పోలీసులకు, గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు. దిశ పోలీస్‌ స్టేషన్లు, కాలేజీల వద్ద అన్ని వివరాలతో హోర్డింగ్స్‌ పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు రైతులకు పోలీసు వ్యవస్థ రక్షణగా ఉండేలా, రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాకి ఒక ప్రత్యేక పోలీస్‌ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తునట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ