ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలు: 1323 సర్పంచ్‌ నామినేషన్లు తిరస్కరణ

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP 1st Phase Panchayat Elections, AP 1st Phase Panchayat Elections Nominations, AP 1st Phase Panchayat Elections Nominations Rejected, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, Mango News, Panchayat polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశలో భాగంగా విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి దశలో సర్పంచ్‌ పదవులకు 19,491 నామినేషన్లు, వార్డు పదవులకు 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటిదశలో దాఖలైన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి 1,323 నామినేషన్లను తిరస్కరించనట్టుగా అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 18,168 నామినేషన్లలను అర్హత కలిగినవిగా అధికారులు ధృవీకరించారు.

అలాగే వార్డు పదవులకు దాఖలైన 79,799 నామినేషన్లలో 2,245 తిరస్కరణకు గురైనట్టు తెలిపారు. 77,554 నామినేషన్లు మాత్రమే సరైన విధంగా ఉన్నట్టు నిర్ధారించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 4 తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థుల యొక్క తుది జాబితాను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =