ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరులో ఐటీసీ వెల్‌కం హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఐటీసీతో భాగస్వామ్యం మంచి అవకాశమని, ఈ రోజు ఈ హోటల్ ప్రారంభించుకోవడం ఓ మంచి కార్యక్రమమని అన్నారు. ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజివ్ పూరికి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు పట్టణంలో ఫైవ్‌స్టార్ హోటల్ ఉండటం, అలాగే ఏపీలో తొలి లీడ్ ప్లాటినం సర్టిఫైడ్ ఫైవ్‌స్టార్ హోటల్ కావడం కూడా సంతోషించతగ్గ విషయమని చెప్పారు.
ఐటీసీ భాగస్వామ్యంతో ఏపీలో వ్యవసాయరంగంలో ప్రత్యేకంగా పుడ్ ప్రాససింగ్‌లో ముందుకు పోతున్నామని సీఎం జగన్ అన్నారు. ఏపీలో ఏ గ్రామానికి వెళ్లినా విద్య, వైద్య, వ్యవసాయం వంటి మూడు రంగాల్లో సమూలమైన మార్పులు గమనించవచ్చని చెప్పారు. వ్యవసాయరంగం కింద ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ఉన్నాయని, దాదాపు 10,700 ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు నడిపిస్తున్నాయన్నారు. ఐటీసీతో ఇంకా మరింత దృఢంగా, పెద్ద ఎత్తున భాగస్వామ్యులవుతున్నామని, ప్రధానంగా పర్యాటక, వ్యవసాయ, పుడ్ ప్రాససింగ్ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ