ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను ప్రారంభించారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయ శాఖ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే భక్తులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఈ-హుండీకి కానుకలు సమర్పించే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ