గతేడాది భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్ సబ్సిడీని అందజేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లిన 5.97 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్ మంగళవారం ₹542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని జమచేశారు. దీనివలన వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరనుంది. కాగా, గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లోఈ ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశారు. ఇంకా, వ్యవసాయ యాంత్రీకరణ డ్రైవ్‌లో భాగంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా 1,220 రైతు సమూహాలకు ₹29.51 కోట్లను సీఎం జగన్ జమచేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ రైతులతో, సంబంధిత అధికారులతో మాట్లాడారు. అదే సీజన్‌లో పంటనష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని సూచించారు. ఆ తర్వాత సీజన్‌లో పెట్టుబడి పెట్టి కొంతమేర నష్టాన్ని పూడ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తీవ్ర వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు 80% రాయితీపై 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను భారీ వర్షాలు కురిసిన వెంటనే అందించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19.93 లక్షల మంది రైతులకు రూ.1612.62 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఏపీ అగ్రికల్చర్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ