ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

104 Ambulance Services in Vijayawada, Ambulance Services in Vijayawada, AP CM YS Jagan, AP CM YS Jagan Started 1088 Ambulances, AP CM YS Jagan Started 1088 Ambulances At a Time in Vijayawada, AP News, AP Political Updates, New Ambulance Services in Vijayawada, Vijayawada, Vijayawada Ambulances

జూలై 1, బుధవారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద 108,104 అత్యాధునిక అంబులెన్స్‌లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఉపయోగించే 108, 104 అంబులెన్స్ లలో ప్రమాణాలు మెరుగుపరచి, సాంకేతిక పరిజ్ఞానం, వసతులు కల్పించి సమూల మార్పులతో తీర్చిదిద్దారు. ఈ రోజు ఒకేసారిగా 1088 అంబులెన్స్ లను సీఎం ప్రారంభించారు.

108 సర్వీసులకు సంబంధించి కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టుకు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు సౌకర్యాలతో, 26 అంబులెన్స్‌లను చిన్నారులకు వైద్య సేవలందించేలా సిద్ధం చేశారు. అలాగే ఇప్పటికే ఉన్న వాటిల్లో 336 అంబులెన్స్‌లలో సమూల మార్పులు చేశారు. ఏఎల్ఎస్ అంబులెన్స్ లలో అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా పరిస్థితులకనుగుణంగా చికిత్స అందించేలా అత్యాధునిక వెంటిలేటర్లును ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu