తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎంసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

EAMCET, Telangana EAMCET 2020, Telangana Eamcet Exam, Telangana EAMCET Exams, Telangana Entrance Exams, Telangana Entrance Exams Postponed, telangana government, Telangana Government Postponed EAMCET Exams, Telangana Government Postponed Exams, Telangana Postponed All Entrance Exams, TSBTET exams

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 1 నుంచి వరుసగా ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఈ పిటిషన్ పై విచారణలో భాగంగా ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. దీంతో ఎంసెట్‌, పాలీసెట్, ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, పీజీఎల్ సెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే జూలై 4,11,12 వ తేదీలలో జరగాల్సిన టైప్‌ రైటింట్‌ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =