డిసెంబర్ 5న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశానికి హాజరు

Ap Cm Ys Jagan To Visit Delhi On 5th December To Attend Meeting On G-20,Ap Cm Ys Jagan,Meeting On G-20,G-20 Precidency Meeting,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi,PM Modi All Party Meeting,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 5వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న, సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జీ-20 సమ్మిట్ పై జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. దేశంలోని అన్ని పార్టీల అధినేతలు కూడా కేంద్రం ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలుస్తుంది.

కాగా ఇటీవలే ఇండోనేషియాలోని బాలిలో 17వ జీ-20 సమ్మిట్ ముగిసిన అనంతరం జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించింది. 2022, డిసెంబ‌ర్ 1 నుండి జీ-20 సమ్మిట్ కు భార‌త‌దేశం అధికారికంగా అధ్య‌క్ష‌త వ‌హించ‌నుంది. భారత్ యొక్క G20 ప్రెసిడెన్సీ/అధ్యక్షత లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్‌ను కూడా ఇటీవలే ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారత్ తన జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో, భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో 32 విభిన్న రంగాలలో సుమారు 200 సమావేశాలను నిర్వహించనుంది. అలాగే వచ్చే ఏడాది దేశంలో జరగనున్న జీ-20 సమ్మిట్ ను భారత్ నిర్వహించనున్న అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా ఘనంగా నిర్వహించి, విజయవంతం చేసేందుకు కేంద్రం ఏర్పాట్లను ప్రారంభించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seven =