పరిటాల శ్రీరామ్,వరదాపురం సూరి మధ్యలో సత్యకుమార్

Dharmavaram Ticket For Whom?, Dharmavaram Ticket, Dharmavaram Seat, Dharmavaram Politics,TDP, YCP, Janasena, Chandrababu, CM Jagan, BJP, Congress, YSRCP,Paritala Sriram, Gonuguntla Suryanarayana, Varadapuram Suri, Political News, Mango News, Mango News Telugu
Dharmavaram Politics,TDP, YCP, Janasena, Chandrababu, CM Jagan, BJP, Congress, YSRCP,Paritala Sriram, Gonuguntla Suryanarayana, Varadapuram Suri

ధర్మవరంలో నిన్నటి వరకు  ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా  పరిస్థితులు మారిపోయాయి.  నిన్నటి వరకూ పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్య అక్కడ  టికెట్ ఫైట్ నడిచింది. అయితే  తాజాగా టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్, బీజేపీ తరఫున వరదాపురం సూరి మధ్య టికెట్ కోసం  పోటీ నెలకొంది.

ఓవైపు పరిటాల శ్రీరామ్.. మరోవైపు వరదాపురం సూరి ధర్మవరంలో టికెట్ కోసం పోటీ పడుతుంటే, మధ్యలో జనసేన కూడా  టికెట్ ఈసారి తమకే ఇవ్వాలంటూ కొత్త డిమాండ్‌ను తెర మీదకి తీసుకొచ్చింది. ధర్మవరం జనసేన ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే అంచనాలతో నియోజకవర్గంలో విస్తృతంగా ర్యాలీలు, ప్రదర్శనలు కూడా చేశారు.

దీంతో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ,బీజేపీ, జనసేన మూడు పార్టీల ఆశావాహులు కూడా అదే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కానీ మరోవైపు ధర్మవరం దాదాపు బీజేపీకే  ఖరారు అయినట్లు  ప్రచారం జరుగుతుంది. కాకపోతే  బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అభ్యర్థిగా ఖరారు అయినట్లేనని అంతా అనుకుంటే.. అనూహ్యంగా ఈ రేసులో సత్యకుమార్ పేరు తెరమీద వినిపిస్తోంది.

ఇప్పటికే బీజేపీ అధిష్టానం ధర్మవరం బరిలో సత్యకుమార్ పేరును ఫైనల్ చేయడానికి చూస్తోందట.  కానీ ధర్మవరం టికెట్ సత్యకుమార్ కు అంత ఈజీగా దొరకదని అనుకుంటున్నారు మూడు పార్టీల శ్రేణులు. స్థానికంగా ఉన్న ఈ ముగ్గురు నాయకులు తమలో ఎవరికో.. ఒకరికి టికెట్ రావాలనే కోరుకుంటారు. కానీ స్థానికేతరుడు అయిన సత్యకుమార్ అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని అంటున్నారట. కాకపోతే కొంతలో కొంత ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాత్రం సత్యకుమార్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవచ్చని తెలుస్తోంది.

ధర్మవరం టికెట్ విషయంలో పరిటాల శ్రీరామ్‌కు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు మధ్య  ముందు నుంచీ  పోటీ ఉంది. దీంతో తన రాజకీయ ప్రత్యర్థి అయిన గోనుగుంట్ల సూర్యనారాయణకు టికెట్ రాకుండా సత్యకుమార్‌కు కనుక టికెట్ వస్తే,  వరదాపురం సూరిపై  రాజకీయంగా పరిటాల శ్రీరామ్ పైచేయి సాధించినట్లే అవుతుందన్న వాదన వినిపిస్తోంది.ఎప్పుడైతే  బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ధర్మవరం పొలిటికల్ తెరమీదకు వచ్చిందో.. అప్పటి నుంచీ వరదాపురం సూరి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారట. ఇంతకీ ధర్మవరం టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 2 =