వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండో విడత సాయం, రైతుల ఖాతాల్లోకి రూ.1114.87 కోట్లు

AP CM YS Jagan, AP CM YS Jagan launches YSR Rythu Bharosa scheme, AP CM YS Jagan Started YSR Rythu Bharosa, AP YSR Rythu Bharosa, PM Kisan Scheme, PM Kisan Scheme Second Installment, YSR Rythu Bharosa, YSR Rythu Bharosa In AP, YSR Rythu Bharosa List, YSR Rythu Bharosa Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లోకి రూ.1,114.87 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్‌ రైతు భరోసా కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 అందజేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా 50.47 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు.

రూ.13500 లలో మే నెలలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4వేలు, సంక్రాంతి సమయంలో మరో రూ. 2వేలు అందిస్తున్నామని చెప్పారు. రెండో విడతలో భాగంగా ఈ రోజు మరో రూ.2 వేలును రైతుల ఖాతాల్లో జమచేస్తునట్టు తెలిపారు. మరోవైపు ఇటీవల పట్టాలు పొందిన గిరిజన రైతులకు కూడా రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని, మొత్తం లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తునట్టు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu