మహిళా దినోత్సవం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan Announces 10% Discount, AP Govt to provide 10 percent discount on Mobiles, International Women’s Day, Jagan announces 10% discount, Jagan Announces 10% Discount on Mobile Phones, Mango News, Mobile Phones for Women in the State on March 8th, Women employees to get five more casual leaves, Womens Day, Womens Day 2021, YS Jagan Announces 10% Discount on Mobile Phones for Women

మార్చి 8 న మహిళా దినోత్సవంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం నాడు క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ పోషణ పథకం, మహిళా సంక్షేమం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే మహిళలకు ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మార్చి 8న మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజైన న 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌ తో రెండు వేల స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

మహిళల భద్రత, సాధికారతకు సంబంధించి షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని, అలాగే మార్చి 8 న పోలీసుశాఖలో పనిచేస్తున్న మహిళలకు స్పెషల్‌ డే ఆఫ్‌ గా ప్రకటించాలని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం హెల్త్‌ చెకప్‌, నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందించడం, దిశ చట్టంపై హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రచారం చేయడం వంటి కీలక నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలో తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =