మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Visits Model House at Tadepalli

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగస్టు 19, బుధవారం నాడు తాడేపల్లి బోట్‌ హౌస్‌ వద్ద వైఎస్ఆర్ హౌసింగ్‌ పథకం‌ కింద నిర్మించిన మోడల్‌ హౌస్‌ను పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ నిర్మించిన ఈ మోడల్‌ హౌస్‌ కు సంబంధించిన అన్ని వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 2.5 లక్షల వ్యయంతో 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, వరండాలతో ఈ మోడల్ హౌస్ నిర్మించినట్టు అధికారులు తెలిపారు. సెంటు స్థలంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ఇంటి నిర్మాణం ఎలా చేపట్టారో ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu