ఆగస్టు 5న వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌

AIIMS, AP CM YS Jagan, AP CM YS Jagan will Participate in Vana Mahotsavam Programme at Mangalagiri AIIMS on August 5, CM Jagan to take part in Vana Mahotsavam, CM Jagan to take part in Vana Mahotsavam at AIIMS, Mangalagiri AIIMS, Mango News, Vana Mahotsavam Programme, Vana Mahotsavam Programme at Mangalagiri AIIMS, YS Jagan will Participate in Vana Mahotsavam Programme, YS Jagan will Participate in Vana Mahotsavam Programme at Mangalagiri AIIMS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగస్టు 5వ తేదీన మంగళగిరి ఎయిమ్స్‌ లో జరగనున్న జగనన్న పచ్చతోరణం (వన మహోత్సవం) కార్యక్రమంలో పాల్గొననున్నారు. వన మహోత్సవం సందర్భంగా ఎయిమ్స్‌ లో మొక్కలు నాటనున్నారు. కాగా సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్న నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ నందు వన మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మరియు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం నాడు పరిశీలించారు.

పూర్తి ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్యమైన అన్ని శాఖల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మాస్కులు, టీ షర్ట్ లు, క్యాప్ లు అందించనున్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ ఆవరణలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా చిన్నారులు, మహిళలు, వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది 3000 మొక్కలను నాటనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ