ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి బుధవారం 9AM వరకు 30,716 కరోనా పరీక్షలు నిర్వహించగా 253 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక కరోనా వలన కొత్తగా గుంటూరు జిల్లాల్లో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7186 కి పెరిగింది. గత 24 గంటల్లో 137 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,83,642 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1694 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ