ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

AP Government Launches Covid-19 Helpline Number,andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 254146 కు చేరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రోజువారీగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హెల్ప్‌లైన్‌ నెంబర్ కూడా ప్రభుత్వం‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూర్తిస్థాయి సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్ 82971 04104 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

ఈ హెల్ప్‌లైన్‌ నంబర్ కు ఫోన్ చేసినపుడు ఆప్షన్ల ద్వారా కరోనా సమాచారం, వైద్య సహాయం వివరాలు, కోవిడ్ సెంటర్లల్లో ఎలా చేరాలి, సంబంధిత అంబులెన్స్‌ వివరాలు తెలియనున్నారు. అలాగే కరోనా లక్షణాలుపై అవగాహన పెంచడం, పరీక్షల వివరాలు తెలపడం, హోమ్‌ ఐసోలేషన్‌ జాగ్రత్తలు, టెలీమెడిసిన్‌, 104 కాల్‌సెంటర్‌, కోవిడ్ వెబ్ సైట్ వివరాలను కూడా ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా అందించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu