ఆగస్టు 15 న రాష్ట్రంలో 10,500 ప‌బ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం

7200 new public toilets, GHMC, GHMC constructing 7200 public toilets in each zone, GHMC Constructing A Total of 7200 Public Toilets, GHMC Latest News, GHMC News, GHMC Public Toilets, List of Public Toilets

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామా రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 10,500 ప్రజా మరుగుదొడ్లను ఆగస్టు 15వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఆగస్టు 13, గురువారం నాడు కేంద్ర గృహ, పట్టణ వ్యవహరాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ను నిర్వహించారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ , అమృత్, స్మార్ట్ సిటీ, ప్రధాన మంత్రి అవాస్ యోజన తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి 1000 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మొబైల్ టాయిలెట్లను అక్టోబర్ 2 న ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 132 పట్టణాలలో బయోమైనింగ్ ప్రాజెక్టులు ప్రారంభించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎఫ్ఎస్ఎస్టిపీ మోడల్ ను రాష్ట్రంలో అభివృద్ధి పరుస్తున్నామని, దీని వలన ఆరోగ్యం మరియు పరిశుభ్రత మెరుగుపడుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం టిఎస్-బీపాస్ ను అమలు చేస్తుందని, దాని వలన నగరాలు, పట్టణాలలో భవనాల అనుమతులలో పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో వీది వ్యాపారులు గుర్తించేందుకు వార్డు స్థాయి బృందం ఏర్పాటు చేయడంతో పాటుగా, స్థానిక ప్రజా ప్రతినిధులను బాగస్వామ్యం చేస్తున్నామని, దీని ద్వారా 5 లక్షల వీది వ్యాపారులను గుర్తించడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 14 =