ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మరో ప్రకటన విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వస్తే ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. పలు గ్రామాల్లో వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు, తమవద్దకు వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలని ఆదేశించింది.
ప్రస్తుత సమయంలో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో చికిత్స నిమిత్తం వస్తే సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు కూడా సమాచారమివ్వాలని ఆర్ఎంపీలకు వైద్య శాఖ సూచించింది. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకోసం ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయన్నుట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu