అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఏర్పాటు

Amaravati, Amaravati Development Authority, Amaravati Metropolitan Region, Amaravati Metropolitan Region Development Authority, Andhra Pradesh, AP Capital Amaravati, AP Govt Issues GO on Amaravati Metropolitan Region Development

ఆంధ్రప్రదేశ్ లో సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ, ఆ చట్టానికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో పదకొండు మందిని సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ఆగస్టు 2, ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన వ్యక్తిని లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో పనిచేసిన వ్యక్తిని తరువాత నియమించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఇప్పటిదాకా ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహం ను కొత్తగా ఏర్పాటు చేసిన ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించారు.

ఏఎంఆర్‌డీఏలో డిప్యూటీ చైర్‌పర్సన్ గా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కన్వీనర్ గా ఏఎంఆర్‌డీఏ కమిషనర్ వ్యవరించనున్నారు. ఇక సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి,‌ గుంటూరు జిల్లా కలెక్టర్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ, రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ-గుంటూరు, రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ-విజయవాడ లను నియమించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =