ఏపీలో సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

AP Inter Advanced Supplementary Examinations, AP Inter Advanced Supplementary Examinations 2021, AP Inter supplementary exams 2021 scheduled, AP Intermediate Public Advanced Supplementary Exams, AP Intermediate Public Advanced Supplementary Exams 2021, AP Intermediate Public Advanced Supplementary Exams Schedule, AP Intermediate Public Advanced Supplementary Exams-2021 Schedule, AP Intermediate Public Advanced Supplementary Exams-2021 Schedule Released, Intermediate Public Advanced Supplementary Exams-2021 Schedule Released, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ విద్యామండలి మంగళవారం నాడు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు ప్రాక్టికల్‌ పరీక్షలను అక్టోబరు 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు.

ముందుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఫలితాలకు సంబంధించి విధి విధానాలను రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇటీవలే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు. అయితే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో సాధించిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపారు. అలాగే ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు గతంలోనే పేర్కొంది. దీంతో వారు ఈ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. జనరల్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులంతా పరీక్ష ఫీజును ఆగస్టు 17లోపు చెల్లించాలని తెలిపారు. కాగా గతంలో పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించిన ప్రథమ సంవత్సర విద్యార్థులు, బెటర్‌మెంట్‌ కోసం హాజరయ్యే ద్వితీయ సంవత్సర విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. హాజరు మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఈ పరీక్ష తేదీలను మరింత పొడిగించబోమని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • సెప్టెంబర్ 15: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • సెప్టెంబర్ 16:: ఇంగ్లీష్ పేపర్-1
  • సెప్టెంబర్ 17: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
  • సెప్టెంబర్ 18: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • సెప్టెంబర్ 20: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • సెప్టెంబర్ 21: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
  • సెప్టెంబర్ 22: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • సెప్టెంబర్ 23: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • సెప్టెంబర్ 15: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • సెప్టెంబర్ 16: ఇంగ్లీష్ పేపర్ -2
  • సెప్టెంబర్ 17: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
  • సెప్టెంబర్ 18: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • సెప్టెంబర్ 20: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • సెప్టెంబర్ 21: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
  • సెప్టెంబర్ 22: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • సెప్టెంబర్ 23: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 1 =