ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు (జూన్ 12, శుక్రవారం) నాడు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 4 నుంచి 23 వరకు జరిగాయి, కాగా కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో వాల్యుయేషన్ జరగకపోవడంతో ఫలితాల విడుదల ఆలస్యం అయింది. ఇటీవల లాక్‌డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తీ చేశారు. దీంతో రేపు మధ్యాహ్నం 12.30గంటల తర్వాత ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu