ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల బృందం సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఉక్రెయిన్ నుండి తమను సురక్షితంగా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు విద్యార్థుల బృందం సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని విద్యార్థులు సీఎం జగన్‌కు వివరించారు. మీరు మన రాష్ట్రానికి చెందినవారని, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ యోగక్షేమాలు చూసుకోవడం తమ బాధ్యతని సీఎం జగన్ తెలిపారు. విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనిపై ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. ఉక్రెయిన్ నుంచి 692 మంది విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. వివిధ విమానాశ్రయాల నుండి 692 విద్యార్థులను రప్పించటం జరిగింది. అలాగే వారు ఇంటికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. మరో 226 మంది విద్యార్థులు/నివాసితులు వారి స్వంత ఏర్పాట్ల ద్వారా వారి ఇళ్లకు చేరుకున్నారు. మొత్తం ఉక్రెయిన్ నుండి 918 మంది ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చారు అని తెలిపారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారని, ఈ క్రమంలో విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌ను అభ్యర్థించారు. ఈ ప్రయత్నాలకు కేంద్రానికి అండగా ఉంటామని సీఎం కూడా హామీ ఇచ్చారని తెలిపారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తెలుగు విద్యార్థులు, ఎన్‌ఆర్‌టీల సమాచారం ఇవ్వాలని కోరుతూ జనవరి 30న రాయబార కార్యాలయానికి సీఎం లేఖ రాశారని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ