తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదు, దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుంది – సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana Definitely An Alternative Will Come Against BJP in The Country Says CM KCR, Definitely An Alternative Will Come Against BJP in The Country Says CM KCR, Definitely An Alternative Will Come Against BJP, CM KCR Attends TRSLP Meeting in Telangana Bhavan And Calls For Peasant Movement, CM KCR Attends TRSLP Meeting in Telangana Bhavan, CM KCR Calls For Peasant Movement, Peasant Movement, CM KCR Decided to Held TRS Legislative Party Meeting on March 21st at Telangana Bhavan, TRS Legislative Party Meeting on March 21st at Telangana Bhavan, CM KCR Decided to Held TRS Legislative Party Meeting on March 21st, CM KCR Decided to Held TRS Legislative Party Meeting, Telangana Bhavan, TRS Legislative Party Meeting, TRS Legislative Party Meeting on March 21st, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Chief minister of Telangana Decided to Held TRS Legislative Party Meeting on March 21st at Telangana Bhavan, TRS Legislative Party Meeting Latest News, TRS Legislative Party Meeting Latest Updates, TRS Legislative Party Meeting at Telangana Bhavan, TRS Party, Telangana, Mango News, Mango News Telugu,

జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే బీజేపీకి ప్రత్యామ్నాయం తప్పకుండా వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం జరిగింది. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో క్రమంగా బీజేపీ ప్రభావం తగ్గుతోందని, ఎన్నికల నాటికి ఇది మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి ఓట్లు, సీట్లు తగ్గాయని తెలిపారు.

తెలంగాణ లో పోయినసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని, తమ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు నిలిచిపోకూడదని భావించినందువల్లనే ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కానీ, ఈసారి ఆ అవసరం లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం లేదని స్పష్టం చేశారు. ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈసారి ఎన్నికలలో 95-105 సీట్లు సాధిస్తామని తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనకు మంచి మిత్రుడని, ఆయన ఎలాంటి ప్యాకేజీ లేకుండానే తమతో కలిసి పనిచేస్తున్నాడని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 2 =