ఎన్నికల వేళ.. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న ముద్రగడ..?

At The Time Of Election Mudragada Will Be Used By YCP, Mudragada Will Be Used By YCP, Mudragada Will Be Used, Mudragada Padmanabham, AP Politics, YCP, CM Jagan, Latest Mudragada YCP News, Latest Mudragada YCP News Update, Mudragada Jion In YCP, CM Jagan, YCP Party, AP MP Elections, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Mudragada Padmanabham, AP Politics, YCP, CM Jagan

అసెంబ్లీ ఎన్నికలవేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఓ వైపు వైసీపీని గద్దె దించేందుకు తెలుగు దేశం, జనసేన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. మరోవైపు రెండో సారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ, జనసేన ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈక్రమంలో ఓ సంచలన వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.

పట్టువిడవని విక్రమార్కుడని పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం తిరిగి పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. వైసీపీని ఢీ కొట్టేందుకు టీడీపీ, జనసేన సిద్ధమవుతున్న వేళ.. ముద్రగడ వైసీపీలో చేరడం సంచలనంగా మారింది. ముద్రగడం వైసీపీలో చేరడం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లేనని.. త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

అయితే గతంలోనే ముద్రగడ పద్మనాభంకు వైసీపీ భారీ ఆఫర్లు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించింది. సీనియర్ వైసీపీ నేత ఎంపీ మిధున్ రెడ్డి పలుమార్లు ముద్రగడను కలిసి పార్టీలో చేరడంపై చర్చలు జరిపారు. అయితే ఎన్నిరోజులు వైసీపీలో చేరేందుకు ఆలోచించిన ముద్రగడ సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముంగిట పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట. అయితే ఈసారి ముద్రగడ కుటుంబానికి వైసీపీ హైకమాండ్ రెండు టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక ఎంపీ టికెట్, మరొకటి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పద్మనాభంను పెద్దాపురం లేదా పిఠాపురం నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. అలాగే పద్మనాభం చిన్నకుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య  ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ