రూ.699కే నెలకు 10 సినిమాలు

Good News For Movie Lovers 10 Movies Per Month For Rs 699, 10 Movies Per Month For Rs 699, Good News For Movie Lovers, Movie Lovers 10 Movies Per Month, Movie Lovers, Movies, PVR, Latest News For Movie Lovers, Latest Good News For Movie Lovers, Latets Movie News, Latest PVR News, Good News For Movie Lovwers, Film News, Mango News, Mango News Telugu
good news for movie lovers, 10 movies per month for Rs.699,movie lovers,movies, PVR

మిగిలిన అన్ని దేశాలకంటే  కళలకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు భారతీయులలో కాస్త ఎక్కువ మందే ఉంటారు. అందులోనూ సినిమా తీయడం, చూడటం అంటే చెవి కోసుకుంటారు. అందుకే సినీ హీరోలు, హీరోయిన్లకు గుడి కట్టి పూజించేవాళ్లు  భారతదేశంలో మాత్రమే కనిపిస్తారు. అందుకే  భారతీయులకు సినిమా అంటే ఒక ఎంటర్ టైన్మెంట్ కాదు..ఒక ఎమోషన్ అంటూ ఉంటారు.

కాకపోతే థియేటర్ల టికెట్ల రేట్లు పెంచేయడంతో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇద్దరు పిల్లలున్నవాళ్లు ఫ్యామిలీతో సహా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి రావాలంటే వ్యాలెట్‌లో రూ. 2- రూ.3 వేలు అయినా పెట్టుకోవాల్సి వస్తోంది.  దీనికితోడు ఓటీటీల సంఖ్య పెరిగిపోవడం..కొద్ది రోజుల్లోనే కొత్త సినిమాలు దర్శనమివ్వడంతో థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసేవాళ్లు తగ్గిపోయారు.

దీంతో మూవీ లవర్స్‌ను తిరిగి థియేటర్స్‌కు రప్పించడం కోసం సరి కొత్త క్రేజీ ఆఫర్‌ను తీసుకువచ్చారు పీవీఆర్ ఐనాక్స్ వాళ్లు. ఇప్పటి వరకూ నార్త్ లోనే కనిపించిన ఈ ఆఫర్‌ను సౌత్‌లోనూ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కేవలం రూ.699లకే  పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో నెలంతా సినిమా టికెట్ పొందే బంపర్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నారు. దీనికోసం మూవీ పాస్ విధానాన్ని మన సౌత్‌లోనూ అతి త్వరలో తీసుకురాబోతున్నారు.

రూ.699లకతో పాస్ కొంటే  నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. కాకపోతే చిన్న కండీషన్ ఉంది. ఈ పాస్ తో సోమ నుంచి గురువారం వరకు మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్ లో సినిమా చూడాలనుకుంటే మాత్రం టికెట్ కొని చూడాల్సిందే తప్ప ఈ పాస్ చెల్లదు. పీవీఆర్ మూవీ పాస్‌ల కోసం ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్ మొదలు కాగా.. ఈ పాస్ లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తామయేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే సంక్రాంతి సీజన్ తర్వాత థియేటర్లు కాస్త ఖాళీ అవుతాయి. మళ్లీ ఆడియన్స్‌ను థియేటర్లలోకి రప్పించాలంటే  ఈ పాస్ బాగా పనికి వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఆఫర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పీవీఆర్ పాస్ కావాలంటే మాత్రం .. https://passport.pvrinox.com/లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 13 =