తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు

Candidate for Tirupati Lok Sabha By-election, Chandrababu, Chandrababu Announces Panabaka Lakshmi as Candidate for Tirupati Lok Sabha By-election, Chandrababu Naidu, Mango News Telugu, Panabaka Lakshmi, Panabaka Lakshmi as Candidate for Tirupati Lok Sabha By-election, Panabaka Lakshmi TDP, Panabaka Lakshmi To Be Tirupati Bypoll Candidate, TDP to field Panabaka Lakshmi in Tirupati, Tirupati Lok Sabha By-election

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సోమవారం నాడు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కీలక నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే ఉపఎన్నికకు సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించినట్లుగా పార్టీ నేతలకు చంద్రబాబు వెల్లడించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తిరుపతి ఎంపీగా ఎన్నికైన వైస్సార్సీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉపఎన్నికపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మరోసారి పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థి గెలుపుకై అనుసరించాల్సిన వ్యూహలపై ఈరోజు జరిగిన సమీక్షలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ