రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్‌ షాకింగ్‌ నిర్ణయం!

YCP, CM Jagan, AP, YCP Candidates
YCP, CM Jagan, AP, YCP Candidates

2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా  అసెంబ్లీలో 175కు 151, లోక్‌సభలో 25కు 22 స్థానాలు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. నాడు ఇంతటి ఘన విజయాన్ని ఊహించని జనంకు జగన్‌ ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. చాలా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాడు. ఇంకొందరి నియోజకవర్గాలను మార్చారు. ఓవైపు బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతుంటే మరోవైపు జగన్‌ మాత్రం దూకుడు కనబరిచారు. విడుదల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన జగన్‌ ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక గత నెల(మార్చి) 16న అందరి పేర్లను ఒకేసారి రిలీజ్ చేశారు. అయితే ఈ లిస్ట్‌ నుంచి ఇద్దరి పేర్లను రిప్లేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ రెండు జిల్లాల్లో మార్పులు?

వైసీపీ అభ్యర్థుల లిస్ట్‌లో 82 అసెంబ్లీ స్థానాలు, 15 పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లు మార్చారు జగన్‌. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసేలా మార్పులు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో ఆయన మార్పులు చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అభ్యర్థుల అవకాశాలపై జగన్‌ ఇటీవలి కాలంలో సర్వేలు చేయగా కొందరు అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవని తేలింది. ఒకట్రెండు రోజుల్లో ఈ జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానాల్లో ఎవరిని ఎంపిక చేసుకుంటారనే దానిపై జగన్ సర్వే కూడా చేయించారట.

కూటమిలో కూడా మార్పులు:

ఇక గరిష్టంగా,జగన్ ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థులను మార్చవచ్చని తెలుస్తోంది. మరోవైపు, ఎన్డీయే మిత్రపక్షాలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని భావిస్తుందట. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, జంట గోదావరి జిల్లాలు మరియు అనంతపురంలో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారన్న టాక్‌ నడుస్తోంది. వారి స్థానాల్లో మిత్రపక్షాలు కొత్త అభ్యర్థులను ప్రకటించవచ్చని సమాచారం. ఇలా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీలు అభ్యర్థులను మార్చాలని భావిస్తుండడం ఆసక్తిని రేపుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY