నల్లమిల్లి తిరుగుబాటుకు వెనక్కి తగ్గిన కూటమి?

Anaparthi Assembly Seat Back To TDP, Anaparthi Assembly Seat, TDP Anaparthi Seat, Assembly Seat Assembly, Assembly Seat, TDP, AP, Anaparthy, AP Elections, Anaparthi News, Anaparthi Ticket, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
tdp, ap, anaparthy, ap elections

ఏపీ ఎన్నికల్లో కూటమి పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక తీవ్ర రచ్చ లేపింది. చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి లేకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తులు కూటమి పెద్దలకు తలనొప్పులు తెప్పించారు. ముఖ్యంగా జనసేన, టీడీపీకు రావాల్సిన టికెట్లు కొన్ని బీజేపీకి వెళ్లడం పలు నియోజకవర్గాల్లో ప్రకంపనలు రేపింది. ఐదేళ్లుగా నియోజకవర్గంలో తిరిగి సీటు దక్కని నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అనపర్తిలో టీడీపీ జెండాలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు తగలబెట్టారు. పార్టీ ఆఫీస్‌లపై దాడి చేశారు. చంద్రబాబుకు డబ్బులకు అమ్ముడుపోయాడని నల్లమిల్లి బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

బుజ్జగించినా వినలేదు.. చివరకు..:

నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఆయన వెనక్కి తగ్గలేదు. తన కుటుంబంతో కలిసి నియోజకవర్గంలో తిరిగారు. ప్రజల మద్దతు తనకే ఉందని చంద్రబాబుకు చూపించే ప్రయత్నం చేశారు. టీడీపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన 94 అసెంబ్లీ స్థానాల్లో అనపర్తి ఒకటి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఆ సమయంలో టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరలేదు. ఆ తర్వాత చేరింది. చివరకు నెల రోజుల తర్వాత నల్లమిల్లి సీటును బీజేపీకి కేటాయించడం తీవ్ర రచ్చకు దారి తీసింది.

మద్దతు లేకపోవడంతో ఇలా:

బీజేపీ సీన్‌లోకి దిగిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరిని రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అనరపర్తి అసెంబ్లీ స్థానాన్ని కూడా కోరుకుంది బీజేపీ. చంద్రబాబు ఇందుకుఅంగీకరించవలసి వచ్చింది. ఫలితంగా రామకృష్ణ రెడ్డి నుండి బలమైన తిరుగుబాటు ఏర్పడింది. అనపర్తి అసెంబ్లీ స్థానానికి శివరామకృష్ణంరాజు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించడంతో రామకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనను శాంతింపజేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇంతలో శివరామ కృష్ణంరాజుకు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల నుంచి తగినంత మద్దతు లభించకపోవడంతో ఆయన బలమైన అభ్యర్థి కాదని బీజేపీ గ్రహించింది. ఇది పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని భావించిన బీజేపీ చివరకు ఈ సీటును వదులుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =