వైసీపీ ఇంఛార్జ్‌ల మార్పు.. రెండో జాబితా సిద్ధం

YCP, YCP Incharges, Second list, CM Jagan
YCP, YCP Incharges, Second list, CM Jagan

అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏపీలో కాక రేపుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జగన్.. ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటికే విజయమే లక్ష్యంగా 11 చోట్ల వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చి సంచలనంగా మారారు. మరో 50 నుంచి 60 మందిని కూడా ఛేంజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ జాబితా సిద్ధమయినట్లు తెలుస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో మార్చిన ఇంఛార్జ్‌ల రెండో జాబితాను జగన్ ప్రకటించనున్నారట.

అయితే ఇంతలోనే రెండో జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీలోని కీలక నేతల దగ్గర నుంచి ఆ జాబితా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ జాబితా దాదాపు ఫైనల్ అయినట్లేనని అంతా అనుకుంటున్నారు.  ఇక వైరల్ అవుతున్న జాబితాను చూస్తే.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులకే ఇంఛార్జి పదవులను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న జాబితా ప్రకారం.. వైసీపీ కొత్త ఇంఛార్జ్‌లుగా శ్రీకాకుళంకు ధర్మాన ప్రసాద్, రాజమండ్రి సిటీకి మార్గాని భరత్, విశాఖ నార్త్‌కు కేకే రాజు, మాడుగులకు బూడి ముత్యాల నాయుడును, ఆమదాలవలసకు తమ్మినేని సీతారంను, నర్సీపట్నంకు పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను, పాతపట్నంకు రెడ్డి శాంతి, పలాసకు సిదిరి అప్పలరాజును, జగ్గంపేటకు తోట నరసింహంను, తునికి దాడిశెట్టా రాజాను, పత్తిపాడుకు వరుపులు సుబ్బారావును, పిఠాపురంకు వంగా గీతను నియమించారట.

అలాగే మాచర్లకు పిన్నెళ్లి రామకృష్ణారెడ్యడి, వినుకొండకు బొల్లా బ్రహ్మనాయుడును, గురజాలకు కాసు మహేష్ రెడ్డిని, గన్నవరంకు వల్లభనేని వంశీని, గుడివాడకు కొడాలి నానిని, తెనాలికి అన్న బత్తుని శివకుమార్‌ను, భీమవరంకు గ్రంధి శ్రీనివాస్2ను, మంగళగిరికి గంజి చిరంజీవిని, నూజివీడుకు మేక వెంకట ప్రతాప్‌‌ను, కైకలూరుకు దూలం నాగేశ్వరరావును, తంబళ్లపల్లికి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని, మచిలీపట్నంకు పేర్ని కిట్టు, విజయవాడ ఈస్ట్‌కు దేవినేని అవినాష్‌లను  కొత్తగా వైసీపీ ఇంఛార్జ్‌లుగా నియమించినట్లు తెలుస్తోంది. మరి వైరల్ అవుతున్న ఈ జాబితాలో నిజం ఎంతుందన్నది తెలియాలంటే మరో నాలుగైదు రోజులు వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE