ఆ మూడు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు వీరే..?

These Are The Janasena Candidates In Those Three Constituencies, These Are The Janasena Candidates, Janasena Candidates, Three Constituencies, Janasena Candidates In Three Constituencies, Janasena, Janasenani Pawan Kalyan, Konaseema, AP Politics, Assembly Elections, Latest Janasena Candidates List, TDP, BJP, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Janasena, Janasenani Pawan Kalyan, Konaseema, AP Politics, Assembly Elections

జనసేనాని పవన్ కళ్యాణ్ కంప్లీట్‌గా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశారు. తనతో పాటు తన అభ్యర్థులను గెలిపించుకొని తీరాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలాగే వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు తెలుగు దేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై జనసేన, టీడీపీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 28 స్థానాల నుంచి జనసేన పోటీ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈక్రమంలో ఆయా స్థానాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఆ స్థానాల నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై అధ్యయనం చేస్తున్నారు.

మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత పార్టీ పరిస్థితులు.. ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు. అలాగే సర్వేల నివేదికల ఆధారంగా ముందుకు ఎళా వెళ్లాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి.. వారి వ్యూహాలను ఎలా తిప్పి కొట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

ఇక కాకి నాడ జిల్లాలోని రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై తెలుగు దేశం పార్టీకి పట్టు ఉన్నప్పటికీ.. పొత్తు కారణంగా చంద్రబాబు జనసేకు కట్టబెట్టారట. ఆ మూడింటిలో రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కాగా.. మిగిలినది ఓపెన్ నియోకవర్గం. ఈక్రమంలో ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ప్రస్తుతం జనసేనాని కసరత్తు చేస్తున్నారట. కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరికి ముగ్గురిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్ఆర్ఐ పెనుమాల జాన్‌బాబుకు జనసేనాని పి.గన్నవరం టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ తన భార్య దేవీని ముందు పెట్టి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆక్రమంలో జాన్ బాబు కాకపోయినా.. తన భార్య దేవీని పి.గన్నవరం నుంచి బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారట. ఇక రాచమంద్రాపురం నుంచి పితాని బాలకృష్ణ పేరును పరిశీలిస్తున్నారట. రెండో ఆప్షన్‌గా చిక్కాల దొరబాబు పేరు కూడా పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి రామచంద్రాపురం టికెట్ దక్కే అవకాశం ఉందట. అలాగే రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావును బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =