నార్త్‌లో పెరిగిపోతున్న కన్నింగ్ కల్చర్

Do You Know What Is Corporate Bookings, What Is Corporate Bookings, Corporate Bookings, Production House, Salar, Dumki, Animal, Director, Producer, Latest Corporate Bookings News, Corporate Bookings News Update, Bollywood Corporate Bookings, Corporate Bookings Strategy, Tollywood, Saalar Corporate Bookings, Animal Corporate Bookings, Mango News, Mango News Telugu
Do You Know what is Corporate Bookings,Corporate Bookings, Production House, Salar, Dumki, Animal, director, Producer

తాజాగా ప్రభాస్ సలార్ బీ టౌన్‌ను షేక్ చేస్తున్నవేళ కార్పొరేట్ బుకింగ్స్ మాట ఎక్కువగా వినిపిస్తోంది.  షారుఖ్ డంకీ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా థియేటర్స్ ఫుల్ అన్న మాట వినిపించడంతో ఇదెలా సాధ్యం అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక షారుఖ్ మాస్టర్ ప్లాన్ ఉందని.. సలార్  పోటీ తట్టుకోలేక కలెక్షన్స్ చూపించుకోవడానికి..ఇలా కార్పొరేట్ బుకింగ్స్ చేయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

అంతెందుకు నేషనల్ థియేటర్ల చైన్ అధినేతలను కూడా ఖాన్ ప్రలోభాలకు గురి చేసినట్లు వార్తలు వినిపించాయి.ఇలాంటప్పుడే షారుఖ్‌పై యానిమల్ డైరక్టర్ సందీప్ రెడ్డి సోదరుడు, ప్రొడ్యూసర్ అయిన నిర్మాత ప్రణయ్ రెడ్డి ఇలా కార్పొరేట్ బుకింగ్స్ చేస్తే తాము ఎప్పుడో వెయ్యి కోట్లు బిజినెస్ చేసేవాళ్లం అంటూ సెటైర్లు వేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఇంతకీ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

నిజానికి ఈ మధ్య నార్త్‌లో ఏ బడా హీరో సినిమా విడుదలైనా కూడా థియేటర్లు హౌస్‌ఫుల్‌గా ఉంటాయి. అయితే ఇక్కడే ఓ తిరకాసు కనిపిస్తోంది. థియేటర్లలో బుకింగ్స్ ఫుల్ ఉన్నా, చాలా సార్లు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే చాలా సార్లు టిక్కెట్లు మిగిలిపోయినప్పుడు, ఏదైనా ఒక కార్పొరేట్ బ్రాండ్ లేదా ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ టికెట్లను పెద్దమొత్తంలో బుక్ చేస్తారు. దీనిని కార్పొరేట్ బుకింగ్ అంటారు.

అంటే ఈ రకమైన బుకింగ్  ఏకకాలంలో చాలా  నగరాల్లో, పెద్ద సంఖ్యలో  జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా, ఒక సిటీకి మాత్రమే పరిమితం చేయగల బ్లాక్ బుకింగ్ కూడా ఉంటుంది. ఇది తరచుగా ఆ హీరో అభిమాన సంఘాలు, తమ ఉద్యోగుల కోసం కార్పొరేట్ కంపెనీలు అపార్ట్మెంట్ బిల్డింగ్స్ యాజమాన్యాలు ఇటువంటి బుకింగ్‌లు చేస్తుంటాయి. అయితే  ఇలా బుకింగ్స్ జరగడం  వెనుక ఉండేది మాత్రం సినిమా ప్రొడక్షన్ హౌస్.

ఇలా చేయడం ప్రొడక్షన్ హౌస్ కు నష్టమా, లాభమా అనే విషయం పక్కన పెడితే ..తరచుగా ప్రొడక్షన్ హౌస్‌లు తమ స్టార్ ఇమేజ్ బిల్డప్ కోసం ఇటువంటి ప్లానులను వేస్తుంటాయి.  బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ మూవీపై ఆడియన్స్‌లో  ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఇక అలా హౌస్ ఫుల్స్ చూపిస్తుంటే.. థియేటర్‌లో ఫుట్‌ఫాల్ పెరిగే ఛాన్స్ కూడా పెరుగుతుంది. అందుకే తమ హీరోల సినిమా కలెక్షన్స్ ని పెంచి మరీ టికెట్స్ బుక్ అయినట్టు చూపిస్తారు.  థియేటర్ ఖాళీగా ఉన్నా, టిక్కెట్లు తామే  కొని హౌస్‌ఫుల్‌గా ప్రకటిస్తారు. ఈ కల్చర్ ఎప్పటికైనా డేంజరేనని.. నిజంగా బాగున్న సినిమాలు, దమ్మున్న హీరోలు వీరి ట్రిక్స్ వల్ల  లాస్ అవుతారని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + twelve =