ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (నవంబర్ 11, 12వ తేదీల్లో) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ముందుగా నవంబర్ 11, శుక్రవారం సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి, 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలుకనున్నారు. అనంతరం శుక్రవారం రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో సీఎం బసచేస్తారు.
ఇక నవంబర్ 12, శనివారం ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలుకుతారు. ఉదయం 10.30-11.45 గంటల వరకు ప్రధాని మోదీతో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. విశాఖ పర్యటనలో కార్యక్రమాలు పూర్తిచేసుకుని మధ్యాహ్నం 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి, 2.00 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































