గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్

Gujarat Assembly Polls Team India Cricketer Ravindra Jadeja's Wife Rivaba Gets BJP Ticket From Jamnagar North, Gujarat Assembly Polls,India Cricketer Ravindra Jadeja, Ravindra Jadeja's Wife Rivaba,Mango News,Mango News Telugu,Ravindra Jadeja,Rivaba,Ravindra Jadeja's Wife Rivaba,Rivaba Gets BJP Ticket,Rivaba From Jamnagar North,Rivaba Contensting From Jamnagar North,Ravindra Jadeja Latest News And Updates,Gujarat Assembly Polls News And Live Updates

మరికొన్ని రోజుల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు పర్యాయాలుగా అధికారంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి అధికారం చేపట్టడానికి వ్యూహాలు రచిస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, బిజెపి గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ తదితరులు మంగళవారం ఢిల్లీలో జరిపిన చర్చల సందర్భంగా ఈసారి పలువురు కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రజలలో మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తులకు ప్రాముఖ్యతనిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్‌ జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపింది. అయితే రివాబా జడేజాకు రాజకీయ నేపథ్యం ఉండటం విశేషం. ఆమె పెద్దనాన్న గతంలో గుజరాత్ మంత్రిగా కూడా పనిచేశారు.

కాగా సెప్టెంబర్ 5, 1990లో జన్మించిన రివాబా.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఇక రవీంద్ర జడేజాను ఏప్రిల్ 17, 2016న పెళ్లి చేసుకున్న ఆమె 2019లో బీజేపీలో చేరారు. ఇదిలా ఉండగా మొత్తం 182 మంది అభ్యర్థులకు గాను 160 మందితో తొలి జాబితాను ఈరోజు విడుదల చేసింది బీజేపీ. డిసెంబర్ 1న మొదటి దశలో ఓటింగ్ జరిగే 89 స్థానాల్లో 84, డిసెంబర్ 5న పోలింగ్ జరగనున్న 93 స్థానాల్లో 76 స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పార్టీ సీనియర్ నేత భూపేంద్రసింగ్ చుడాసమా ప్రకటించారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =