ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు అంగీకరించి, వారి బదిలీ ఫైల్‌ను క్లియర్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన 711 మంది క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు.
ముందుగా బుధవారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను తెలంగాణకు చెందిన ఉద్యోగుల ప్రతినిధులు కలిశారు. ఇకపై తమను తెలంగాణ ప్రభుత్వంలో సర్వీసును కొనసాగించేందుకు ఏపీ నుంచి రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యోగుల విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి, వారిని రిలీవ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. అలాగే సొంత రాష్ట్రానికి వెళ్ళుతున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ విజ్ఞప్తిని సీఎం వైఎస్ జగన్ అంగీకరించి, తమను రిలీవ్ చేసేందుకు ఒప్పుకోవడం పట్ల తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ