ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌

AP CM inaugurates Prajasakti building, AP News, CM YS Jagan, CM YS Jagan Inaugurated Prajasakti Office, CM YS Jagan Inaugurated Prajasakti Office in Tadepalli, Prajasakti Office, Prajasakti Office in Tadepalli, Tadepalli, YS Jagan Inaugurated Prajasakti Office, YS Jagan Latest News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రజాశక్తి భవనాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్‌ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ