ఢిల్లీలో కరోనా తీవ్రత, బాణాసంచాపై నిషేధం విధిస్తూ నిర్ణయం

Delhi bans firecrackers before Diwali, Delhi CM Arvind Kejriwal, Delhi CM Arvind Kejriwal Says Firecrackers, Delhi Government bans firecrackers, Firecrackers Banned in Delhi, Firecrackers has Banned due to Covid-19, Mumbai bans firecrackers on Diwali

ఢిల్లీలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో కరోనా పరిస్థితి మరియు సంసిద్ధతపై చీఫ్ సెక్రెటరీ, హెల్త్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం నాడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్ష నిర్వహించారు. నగరంలో పండుగ సీజన్ మరియు కాలుష్యం కారణంగా కరోనా కేసులు పెరిగాయని, దీంతో కరోనా నివారణకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. నిర్ణయాల్లో భాగంగా ఢిల్లీలో దీపావళి బాణాసంచాపై (క్రాకర్స్) నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ ఇన్‌ఫ్రా, ఆక్సిజన్, ఐసియు పడకలను పెంచాలని నిర్ణయించారు.

ఇక ప్రైవేట్ ఆసుపత్రులలో ఐసియు పడకలను పెంచాలన్న ప్రభుత్వ ఆర్డర్‌ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామని, ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేస్తుందని ఆశిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా టెస్టులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మరణాల రేటు కూడా పెరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంటుందని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో నవంబర్ 5, గురువారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,16,653 కి చేరింది. 3,71,155 మంది కోలుకోగా, ప్రస్తుతం 38,729 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన ఢిల్లీలో ఇప్పటికి 6,769 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + sixteen =