అభ్యర్థుల ప్రకటన పూర్తవక ముందే పోటా పోటీ

Vijayawada Politics, Bejwada, competition, candidates announcement, TDP, YCP, Congress, Jana Sena, BJP, Pawan Kalyan, Lokesh, Jagan,AP Elections,Mango News Telugu,Mango News
Vijayawada Politics, Bejwada, competition, candidates announcement, TDP, YCP, Congress, Jana Sena, BJP, Pawan Kalyan, Lokesh, Jagan

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బెజవాడ పార్లమెంట్ కోసం కేశినేని బ్రదర్స్ రేసులో ఉండగా..అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. అధికార వైసీపీలో సీట్ల విషయం కొలిక్కి వచ్చినా, పొత్తుల నేపథ్యంలో టీడీపీలో సీట్ల సర్ధుబాటు  కొలిక్కి రాలేదు.

బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్దమవుతున్నాయి.  ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ స్థానం కోసం ఎంపీ కేశినేని నానిని వైసీపీ ఇన్చార్జిగా నియమించింది.మరోవైపు త్వరలోనే నాని సోదరుడు కేశినేని చిన్ని పేరును అధికారికంగా ప్రకటిస్తారంటూ వార్తలు రావడంతో.. టీడీపీ నుంచి తనకే టిక్కెట్ అనుకుంటూ పార్లమెంట్ పరిధిలో ప్రచారాలు చేస్తున్నారు.

పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే వైసీపీ ఇంచార్జిలు ఖరారయ్యారు. అయితే టీడీపీ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించకపోయినా.. కొన్నిచోట్ల ఇన్చార్జిలకు మాత్రం టిక్కెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో.. ఎలాగైనా టికెట్ దక్కుంచుకోవడానికి వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో  7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా… వీటిలో విజయవాడ సిటీ పరిధిలో 3 సెంగ్మెట్లు ఉన్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు   టిక్కెట్ ఖరారయినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ తరపున వేరెవరూ పోటీలో లేకపోవడంతో గద్దెకు టిక్కెట్ కన్మర్మ్ అయినట్లేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ ఇన్చార్జిగా దేవినేని అవినాష్ నాలుగేళ్లుగా ఇక్కడ కొనసాగుతున్నారు. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో కూడా అవినాష్‌కే  వైసీపీ టిక్కెట్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్లేసులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వైసీపీ ఇంచార్జిగా నియమించింది . మరోవైపు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు టిక్కెట్ ఖరారయినట్లు వార్తలు వస్తుండగా..వంగవీటి రాధా కూడా అదే టిక్కెట్ ఆశిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా కూడా బోండా ఉమా ..ఈ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేసేస్తున్నారు.

విజయవాడ సిటీలో ఉన్న మూడో నియోజకవర్గం బెజవాడ వెస్ట్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ స్థానంలో  షేక్ ఆసిఫ్‌ను ఇన్చార్జిగా వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఇక్కడ కానీ టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఈసీటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక్కడ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న టీడీపీ టిక్కెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా.. జనసేన నుంచి ఇన్చార్జిగా ఉన్న పోతిన వెంకట మహేష్ కూడా  టిక్కెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న మైలవరంలో రాజకీయం రోజురోజుకూ హీటెక్కుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తాజాగా వైసీపీని వీడి..త్వరలోనే సైకిల్ ఎక్కుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మైలవరం ఇంచార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఉండగా..అతనికి  బదులు తనకు టిక్కెట్ ఇమ్మని  సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు మంతనాలు జరుపుతున్నారు. సరిగ్గా ఇదే  సమయంలో కృష్ణ ప్రసాద్ కూడా రేసులో ఉండటం ముందుముందు టీడీపీకి ఇబ్బందులు తప్పవన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కాకపోతే దేవినేని ఉమాకు టిక్కెట్ లేదని  చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసారన్న ప్రచారం కూడా జరుగుతోంది.అయితే ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు, కృష్ణ ప్రసాద్‌లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే దానిపై పార్టీ సర్వేలు చేస్తుంది. ఇప్పటికే టీడీపీలో ట్రయాంగిల్ పోరు ఉండగా.. జనసేన ఇన్చార్జి అక్కల రామ్ మోమన్ రావు కూడా పొత్తులో భాగంగా తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అటు వైసీపీ మాత్రం కొత్తగా సర్నాల స్థానికంగా పలుకుబడి ఉన్న తిరుపతిరావును ఇన్చార్జిగా నియమించింది.

ఇక నందిగామ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా ఉన్న తంగిరాల సౌమ్యకే ..వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ కన్మర్మ్ చేశారు. అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఈసారీ కూడా బరిలో దిగుతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు టీడీపీ టికెట్ ఖరారవగా..ఇక్కడి నుంచి మాజీ మంత్రి నెట్టెం రఘురామ్  తనకూ టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయభాను మరోసారి ఈ  ఎన్నికల బరిలో ఉండనున్నారు.

ఇక తిరువూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్వామిదాస్ ను  ఇన్చార్జిగా నియమితులయ్యారు.  టీడీపీలో  సీటు విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇన్చార్జిగా శేవల దేవదత్ తో పాటు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారు. మొత్తంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో చాలా వరకూ టికెట్లు కన్ఫమ్ కాకపోయినా ఎవరివారే ప్రచారాల కోసం సిద్ధమవడం హాట్ టాపిక్ అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE