ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. రెండోరోజైన ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 13,036 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ముందుగా వ్యాక్సిన్ పంపిణి ప్రారంభమైన శనివారం నాడు 19,108 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో రాష్ట్రంలో రెండ్రోజుల్లో 32,144 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1959 మందికి, కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 480 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఆదివారం నాడు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మాత్రమే స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారని, కాసేపటికే కోలుకుని ఇంటికి వెళ్లినట్టు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియను వారం రోజులు పాటుగా కొనసాగించాలా లేదా ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలా అనే అంశంపై అధికారులు సోమవారంనాడు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ