ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 8, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,766 కు చేరింది. కరోనా నుంచి మరో 61 మంది రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన గుంటూరు మరియు నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7176 కి పెరిగింది. గత 24 గంటల్లో 25907 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,42,62,086 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 8, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,90,766
- కొత్తగా నమోదైన కేసులు : 74
- కొత్తగా నమోదైన మరణాలు : 2
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,82,581
- యాక్టీవ్ కేసులు : 1009
- మొత్తం మరణాల సంఖ్య : 7176
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ