దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్ ‌ను ప్రవేశపెడుతున్నాం: ఏపీ సీఎం వైఎస్ జగన్

2021 International Women’s Day, AP CM YS Jagan, AP CM YS Jagan Participated in Women’s Day Celebrations, International Women’s Day, International Women’s Day 2021, International Women’s Day Celebrations, International Women’s Day News, Mango News, Narendra Modi, PM Modi, Women’s Day Celebrations at Camp Office, Womens Day, World Women’s Day, YS Jagan Participated in Women’s Day Celebrations

మహిళ అంటే ఆకాశంలో సగభాగమని, ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హోం మంత్రి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత, మహిళా కమీషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, ఇతర మహిళా ఎమ్మెల్యేలతో కలసి సీఎం వైఎస్ జగన్‌ కేక్‌ కట్‌ చేసారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని చెప్పారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని‌ తెలిపారు. అనంతరం 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను ఆవిష్కరించారు. బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 16 =