తెలుగువారి అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు.. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయనకు అంజలి ఘటించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వి.బి. రాజేంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తచరిత్ర సృష్టించిన నాయకుడని, రాజకీయంగా కొత్త తరానికి అవకాశాలు కల్పించిన ఆదర్శ నేత అని పలువురు నాయకులు ఆయనను గుర్తు చేసుకున్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడని కొనియాడారు. అలాగే, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తారక రాముడితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని.. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ