టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్‌

Andhra Pradesh, Andhra Pradesh COVID-19, Andhra Pradesh COVID-19 14986 New Positive Cases, Andhra Pradesh COVID-19 Cases, Andhra Pradesh COVID-19 News, COVID-19, Devineni Uma Tested Positive, Devineni Uma Tested Positive for Covid-19, Ex-Minister Devineni Uma Tested Positive for Covid-19, TDP Senior Leader Ex-Minister Devineni Uma, TDP Senior Leader Ex-Minister Devineni Uma Tested, TDP Senior Leader Ex-Minister Devineni Uma Tested Positive, TDP Senior Leader Ex-Minister Devineni Uma Tested Positive for Covid-19

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని దేవినేని ఉమా పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీలో జనవరి 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388 కు చేరుకుంది. ఇందులో 20,65,696 మంది ఇప్పటికే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా, ప్రస్తుతం 30,182 మంది బాధితులు కోవిడ్ కు చికిత్స పొందుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =