పంజాబ్‌ సీఎం అభ్యర్థి ‘భగవంత్‌ మాన్‌’.. ప్రకటించిన ఆప్

Aam Aadmi Party, Aam Aadmi Party Announces Bhagwant Mann Singh As CM Candidate In Punjab, Aam Aadmi Party declares Bhagwant Mann as its Punjab CM candidate, AAP President, AAP President Announces Bhagwant Mann As CM Candidate, AAP President Announces Bhagwant Mann As CM Candidate In Punjab, AAP’s chief ministerial candidate, Bhagwant Mann, Bhagwant Mann As CM Candidate In Punjab, Bhagwant Mann As CM Candidate In Punjab Assembly Elections, Bhagwant Mann As CM Candidate In Punjab Assembly Elections 2022, Bhagwant Mann Was AAP’s chief ministerial candidate For 2022 Elections, Mango News, Punjab Assembly Elections, Punjab Assembly elections 2022, Punjab Assembly Elections Latest News, Punjab Assembly Elections Live Updates

‘ఆమ్ఆద్మీ పార్టీ’ (ఆప్‌) పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, దానికి లీడరైన ‘అరవింద్ కేజ్రీవాల్’ అప్పటివరకు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కారు.. అలాగే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అందుకే ఆయన పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కాకపోతే, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే ఒక వ్యక్తిగా ఆయన సామాన్యులకు సుపరిచితం. ఆ ఇమేజ్ తోనే కేజ్రీవాల్ ‘ఆమ్ఆద్మీ పార్టీ’ పెట్టి ఢిల్లీ లో అధికారంలోకి వచ్చారు. ఆయన గెలుపు నూతన రాజకీయాలకు నాంది పలికింది. ఒక సామాన్యుడు రాజకీయాలలో పార్టీ పెట్టి, అధికారంలోకి రావడం అనేది ఈరోజుల్లో మాములు విషయం కాదు.

అయితే, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ.. పంజాబ్‌లోనూ పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆప్‌.. తాజాగా పంజాబ్‌ సీఎం అభ్యర్థిగా ‘భగవంత్‌ మాన్’ పేరు‌ను ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మంగళవారం మొహాలీలో జరిగిన మీడియా సమావేశంలో భగవంత్‌ మాన్‌ పేరును ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖరారు చేశారు. 93 శాతం మంది భగవంత్‌ పేరును సూచించారని ఆయన తెలిపారు. 3 కోట్ల మంది ప్రజల అభిప్రాయం మేరకే సీఎం అభ్యర్థి ఎంపిక జరిగినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. కాగా ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 20న జరగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − twelve =