గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌: నేడు పలు కంపెనీలతో జగన్ సర్కార్ ఎంవోయూలు, హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు

Global Investors Summit AP Govt To Make Over 200 MoUs Today Union Ministers Kishan Reddy Sonowal Along with CM Jagan To Attend,Global Investors Summit,AP Govt To Make Over 200 MoUs Today,Union Ministers Kishan Reddy Sonowal,Union Ministers with CM Jagan To Attend Summit,Mango News,mango News Telugu,Andhra receives proposals,AP Industries Min Invites Central Ministers,G20 Summit,G20 Summit 2023,G20 India,G20 Summit 2023 India LIVE,G20 Summit LIVE,G20 India LIVE,G20 India 2023,2023 G20,2023 G20 New Delhi summit,New Delhi Summit G20,AP Global Investors Summit Updates,AP Investors Summit In Vishakapatnam

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం తొలిరోజు అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టింది. దాదాపు రెండు లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ టార్గెట్‌తో జీఐఎస్ ప్రారంభించిన జగన్ సర్కార్ మొదటిరోజునే దానిని అధిగమించింది. దిగ్గజ సంస్థలతో మేజర్‌ ఎంవోయూలు కుదుర్చుకోవడం ద్వారా సుమారు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టింది. తొంభై రెండు ఒప్పందాల ద్వారా 11.85 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించింది. ఇక ఈ ఎంవోయూల ద్వారా దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో నేడు కూడా భారీగా ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. వివిధ కంపెనీలతో సుమారు లక్షా 15వేల కోట్ల రూపాయల విలువైన 248 ఎంవోయూలు కుదుర్చుకోనుందని సమాచారం. వీటి ద్వారా మరో రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ రెండ్డు రోజుల్లో దాదాపు 340 ఎంవోయూలు ద్వారా 13 లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఒప్పందాల ద్వారా 20 రంగాల్లో సుమారు 6లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగొచ్చని భావిస్తోంది. ఇక ఈ సదస్సుకు దాదాపు 25 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులనుద్దేశించి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రసంగించనున్నారు.

కాగా ఈరోజు సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాలా, రాజీవ్ చంద్ర శేఖరన్ తదితరులు హాజరవుతున్నారు. అలాగే వీరితో పాటు భారత్ బయోటెక్ చైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా, రెడ్డీస్ లాబోరేటరీ చైర్మన్ సతీష్ రెడ్డి, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీకృష్ణ బండి, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, గ్రీన్ కో డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి, లారస్ లాబ్స్ చైర్మన్ సత్యనారాయణ చావా, నోవా ఎయిర్ సీఈఓ గజానన నాబర్, సెయింట్ గోబైన్ సీఈఓ సంతానం, అపాచి హిల్ టాప్ హెడ్ సెరిగో లీ, బ్లెండ్ హబ్ వ్యవస్థాపకుడు హెన్ రిక్ స్టామ్, వీస్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మందావే వాలా తదితర పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మధ్యాహ్నం ముగింపు ఉపన్యాసం ఇవ్వనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE