కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం.. మరోసారి స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

TPCC Chief Revanth Reddy Announces If Congress Comes To Power Dharani Portal Will Be Canceled,TPCC Chief Revanth Reddy Announcement,Dharani Portal Will Be Canceled,Revanth Reddy Announces Congress Comes To Power,Mango News,Mango News Telugu,Will Shut Dharani If Congress Storms To Power,Dharani Will Be Scrapped If Congress Comes To Power,Cancel Dharani And Revert To Old System,Congress Government'S First Go,Cancelling Dharani,Congress Party Latest News And Updates,Revanth Reddy Live News,Congress Party News

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ఈ మేరకు ఆయన హాత్‌ సే హాత్‌ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి మానకొండూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారని, కానీ ప్రజల సమస్యలను తీర్చలేకపోయారని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలుస్తున్నపుడు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్య, పోడు భూములు పైనే ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయని, వీటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు? అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికే ధరణి పోర్టల్‌ను తెచ్చారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని, వారి దోపిడీ భాగోతాలను బయటపెడుతున్నందుకే తమపై పోలీసులను ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

నిబంధనల ప్రకారం, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు 4+4 సెక్యూరిటీ అందించాల్సి ఉందని, అయితే తనపై కక్ష కట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం దానిని 2+2 కు కుదించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిని అవకాశం తీసుకుని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. కోర్టు మళ్ళీ భద్రతా పెంచమని ఆదేశించిందని తెలిపారు. గడచిన రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయని, వారి నాటకాలు ప్రజలకు అర్ధమయ్యాయని గ్రహించి ఈసారి విడివిడిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్తలు అంబానీ, అదానీలతో సీఎం కేసీఆర్‌ కుటుంబం పోటీ పడుతోందని, కేటీఆర్‌, హరీశ్‌రావు కవితలకు పదవులతో పాటు ముడుపులు కూడా అందుతున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కేసీఆర్‌ కుటుంబాన్ని ఇంటికి పంపించాలని కోరారు. ఇక ఏఐసీసీ నిర్ణయం మేరకు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు 60రోజుల మొదటి విడత పాదయాత్ర కొనసాగుతుందని, రానున్న ఎన్నికల్లో బీఫామ్‌ కావాలంటే నేతలు వారి పరిధిలో జోడో యాత్రలో పాల్గొనాల్సిందేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =